Ram Navami Date and Time 2024 : హిందువులు జరుపుకునే అతిపెద్ద పండుగల్లో శ్రీరామ నవమి కూడా ఒకటి. శ్రీరాముడిని భారతీయులు ఆదర్శ పురుడిగా కొలుస్తారు. తండ్రి మాట కోసం అడవులకు వెళ్లిన రాముడిని ఇష్టపడని వారంటు ఉండరు. ఒక కొడుకుగా, అన్నగా, భర్తగా, మిత్రుడిగా, రాజుగా రాముడు అన్ని విధలా తన పాత్రకు న్యాయం చేశాడు. అందుకే రాముడిని ప్రతీఒక్కరు దేవుడిగా పూజిస్తుంటారు.
వాల్మీకి రాసిన రామాయణమే కాకుండా మన దర్శకులు సైతం ఎన్నో కథలను రాముడి గొప్పతనపై సినిమాలు తీశారు. రామాయణం అనేది అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడైనా ఎవర్ గ్రీన్ కథగానే ఉంటూ వస్తోంది. ఆనాటి నుంచి నేటి జనరేషన్ వరకు ప్రతీఒక్కరు రాముడి పాత్రను ఇష్టపడుతున్నారు. అందుకే రామాయణం మరియు రాముడు చిరస్థాయిగా నిలిచిపోతోంది.
Read more : Ayodhya Ram Temple Timings
2024 ఏడాదిలో ఏప్రిల్ 17వ తేదిన శ్రీ రామ నవమిని జరుపుకోనున్నారు. ప్రతీ సంవత్సరం మాదిరిగానే చైత్రం శుక్ల పక్షం 9వ రోజున రామ నవమి జరుగనుంది. ఈ రోజున శ్రీరాముడి వివాహాన్ని భక్తులు ఘనంగా జరిపిస్తారు. అన్ని దేవాలయాల్లో శ్రీరామ నవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి.
శ్రీ రామ నవమిని పురస్కరించుకొని చైత్ర నవరాత్రులు జరుగుతున్నాయి. దీనినే వసంత నవరాత్రి అని పిలుస్తారు. ఈ పర్వంలో తొమ్మిదవ రోజు శక్తికి అంకితం చేయబడుతుంది. ఈ రోజును రామ నవమి తిథిగా భక్తులు జరుపుకుంటారు.
ఈ ఏడాది చైత్రమాస శుక్లపక్ష 9వ తిథి ఏప్రిల్ 16వ తేదీ మధ్యాహ్నం 1.23 గంటలకు ప్రారంభం కానుంది. ఆ తిథి మరుసటి రోజు అంటే ఏప్రిల్ 17 మధ్యాహ్నం 3.14 వరకు ఉండనుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 17న ఉదయం 11.03 నుంచి మధ్యాహ్నం 1.38 వరకు రామ నవమి సమయం వస్తుంది. దీంతో ఈరోజున రామ నవమిని జరుపుకునేందుకు దేశ వ్యాప్తంగా ఉన్న ఆలయాలు ముస్తాబు అవుతున్నాయి.
తెలంగాణలోని భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంతోపాటు ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో ఈసారి శ్రీరామ నవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి.
Read more : 👇👇👇
Daily Updates రోజు వారీ, వారానికి సంబంధించిన రాశి ఫలాలు, జ్యోతిష్య సంబంధించిన కథనాల కోసం Astrologytelugu.com వెబ్ సైట్ ను క్లిక్ చేయండి.
తాజా సినిమాల పాటలు, భక్తి పాటలు, జానపద పాటల కోసం www.lyricss.co.in వెబ్ సైట్ ను సందర్శించండి.
Keywords : Ram Navami Date and Time 2024 | Ram Navami 2024 | Ram Navami | Ram Navami 2023 | Ram Navami 2024 start date and end date | Happy Ram Navami | Sri Rama Navami 2024 | Sri Rama Navami 2023 | Sri Rama Navami | Sri rama navami 2024 USA |Sri rama navami images | Sri rama navami wishes | sri rama Navami | sri rama navami 2024 | sri rama navami 2024 date.
Read more : 👇👇👇
Post a Comment
గమనిక : పైన చెప్పబడిన రాశిఫలాలు, ఇతర కథనాలన్నీ కూడా జ్యోతిష్య శాస్త్రం, మతవిశ్వాలపై ఆధారపడి ఉంటాయి. ఇవి కేవలం ఊహల ఆధారంగా పేర్కొనబడినవి. దీనికి ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునేందుకు నిష్ణాతులైన జ్యోతిష్య పండితులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరని మనవి. వీటిని www.astrologytelugu.com ధృవీకరించడం లేదు.