Astrology Horoscope Today in Telugu : మే 12 (ఆదివారం), 2024 రోజున 12 రాశులకు చెందిన వ్యక్తుల రాశి ఫలాలను ఒకసారి పరిశీలిస్తే ఈ కింది విధంగా ఉన్నాయి.
మేష రాశి (Aries Horoscope Today) : మేష రాశి జాతకులకు ఈరోజు రాబడి ఆశాజానకంగా ఉంటుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. మిత్రులతో విబేధాలు తీరుతాయి. సమాజ సేవలో పాలుపంచుకుంటారు.. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి తగ్గుతుంది. విద్యార్థుల శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. మహిళకు కుటుంబం నుంచి మద్దతు ఉంటుంది. మేష రాశి జాతకులు శ్రీ లక్ష్మీ నర్సింహ స్వామి స్తోత్రాలు పఠించడం శ్రేయస్కరం.
వృషభ రాశి (Taurus Horoscope Today) : వృషభ రాశి జాతకులకు ఈరోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. శుభకార్యాల్లో పాల్గంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగుల్లో ఉత్సాహం నెలకొంటుంది. విద్యార్థులకు కొత్త అవకాశాలొస్తాయి. మహిళలకు భూ లాభాలున్నాయి. వృషభ రాశి జాతకులు హయగ్రీవ స్తోత్రాలు పఠించడం శ్రేయస్కరం.
మిథున రాశి (Gemini Horoscope Today) : మిథున రాశి జాతకులకు ఈరోజు ఆలోచనలు నిలకడగా ఉండవు. పనులు సకాలంలో పూర్తికావు. ఆర్థిక లావాదేవీగా సజావుగా సాగవు. వ్యాపారులకు ఇబ్బందికర పరిస్థితులు. ఉద్యోగులకు పని ఒత్తిడి ఉంటుంది. విద్యార్థులకు శ్రమాధిక్యం. మహిళలకు సాధారణంగా గడుస్తుంది. మిథున రాశి జాతకులు మహా గణపతిని పూజించడం శ్రేయస్కరం.
కర్కాటక రాశి (Cancer Horoscope Today) : కర్కాటక రాశి జాతకులకు ఈరోజు పనులు మందకొడిగా సాగుతాయి. కీలక నిర్ణయాలు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలించవు. ఉద్యోగావకాశాలు చేజారుతాయి. ఉద్యోగులకు ఒత్తిడి. వ్యాపారులకు స్వల్ప లాభాలు. విద్యార్థులకు నిరాశే. మహిళలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కర్కాటక రాశి జాతకులు గణపతిని ఆరాధించడం శ్రేయస్కరం.
సింహ రాశి (Leo Horoscope Today) : సింహ రాశి జాతకులు ఈరోజు ఉత్సాహంగా గడుపుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. బంధుమిత్రులతో విబేధాలు సర్దుమణుగుతాయి. వ్యాపారులకు రాబడులు వస్తాయి. ఉద్యోగులకు ప్రశంసలు. విద్యార్థులకు నూతనోత్తేజం. మహిళలకు ఆస్తి లాభ సూచనలు. సింహ రాశి జాతకులు సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం శ్రేయస్కరం.
కన్య రాశి (Virgo Horoscope Today) : కన్యా రాశి జాతకులకు ఈరోజు ఆదాయానికి మంచి ఖర్చులుంటాయి. మిత్రులతో విబేధాలు. ప్రయాణాలు రద్దు చేసుకుంటారు. ఉద్యోగావకాశాలు చేజారుతాయి. వ్యాపారులకు నిరాశాజనకం. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. విద్యార్థులకు నిరాశే. మహిళలకు కుటుంబంలో చికాకులు. కన్యా రాశి జాతకులు శివుడిని ఆరాధించడం శ్రేయస్కరం.
తులారాశి (Libra Horoscope Today) : తులా రాశి జాతకులకు ఈరోజు ఆర్థిక పరిస్థితి ఆశాజానకంగా ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. వ్యాపారులకు లాభాలొస్తాయి. ఉద్యోగులకు శుభ సమాచారం. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు వస్తాయి. విద్యార్థులు ఉత్సాహంగా గడుపుతారు. మహిళలకు ఆస్తి లాభ సూచనలు. తులా రాశి జాతకులు శ్రీ లక్ష్మీ నర్సింహా స్వామి స్తోత్రాలు పఠించడం శ్రేయస్కరం.
వృశ్చిక రాశి (Scorpio Horoscope Today) : వృశ్చిక రాశి జాతకులకు ఈరోజు ఆర్థిక పరిస్థితి మిశ్రమంగా ఉంటుంది. ఆలోచనలు నిలకడగా ఉండవు. రాబడి తగ్గి అప్పులు చేస్తారు. వ్యాపారులకు సాధారణంగా గడుస్తుంది. ఉద్యోగులకు బదిలీ సూచనలు. విద్యార్థులకు నిరాశే. నిరుద్యోగులకు నిరుత్సాహం. మమహిళలకు అనారోగ్య సూచనలు. వృశ్చిక రాశి జాతకులు శ్రీ వేంకటేశ్వర స్వామిని పూజించడం శ్రేయస్కరం.
ధనస్సు రాశి (Sagittarius Horoscope Today) : ధనస్సు రాశి జాతకులకు ఈరోజు ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నూతన ఉద్యోగయోగం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి తగ్గుతుంది. మహిళలకు చికాకులు తొలగిపోతాయి. ధనస్సు రాశి జాతకులు ఆదిత్య హృదయం పఠించడం శ్రేయస్కరం.
మకర రాశి (Capricorn Horoscope Today) : మకర రాశి జాతకులకు ఈరోజు పనులు సకాలంలో పూర్తవుతాయి. మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేసే అవకాశముంది. వ్యాపారులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి తగ్గుతుంది. విద్యార్థులకు అనుహ్యంగా అవకాశాలు లభిస్తాయి. మహిళలు ఉల్లాసంగా గడుపుతారు. మకర రాశి జాతకులు శ్రీ వేంకటేశ్వర స్వామిని ఆరాధించడం శ్రేయస్కరం.
కుంభరాశి (Aquarius Horoscope Today) : కుంభ రాశి జాతకులకు ఈరోజు ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. కుటుంబంలో సమస్యలు ఎదుర్కొంటారు. దూర ప్రయాణాలు చేస్తారు. వ్యాపారులకు ఒడిదుడుకులుంటాయి. ఉద్యోగులకు తీవ్రమైన పని ఒత్తిడి. విద్యార్థులకు అవకాశాలు చేజారుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ముందుకు సాగవు. మహిళలకు ఇంటాబయటా చికాకులు. కుంభ రాశి జాతకులు కనకధారా స్తోత్రాలు పఠించడం శ్రేయస్కరం.
మీనరాశి (Pisces Horoscope Today) : మీన రాశి జాతకులకు ఈరోజు ఆర్థిక పరిస్థితి మందకొడిగా ఉంటుంది. కుటుంబంలో విబేధాలు తలెత్తుతాయి. శ్రమ పెరిగి పనులు వాయిదా వేస్తారు. ఉద్యోగులకు బదిలీ సూచనలు, వ్యాపారులకు సాధారణంగా గడుస్తుంది. విద్యార్థుల అంచనాలు తారుమారు అవుతాయి. నిరుద్యోగులకు అవకాశాలు చేజారుతాయి. మహిళలకు కుటుంబంలో చికాకులు. మీన రాశి జాతకులు గణపతిని పూజించడం శ్రేయస్కరం.
గమనిక : ఈ సమాచారం మత విశ్వాసాలు, ఇంటర్నెట్లో దొరికి సమాచారం మేరకు అందించడం జరుగుతుంది. వీటిని Astrologytelugu.com ధృవీకరించడం లేదు.
Keywords : April Month Horoscope, Daily Horoscope, Today Horoscope, Astrology Daily Horoscope, Horoscope in Telugu, Horoscope Today Telugu, Horoscope, రాశి ఫలాలు, రాశి ఫలితాలు, తెలుగు జాతకం, May Month Horoscope, May horoscope 2024, May horoscope 2024, May horoscope signs, May 11th horoscope, free daily horoscope, horoscope du jour, horoscope, horoscope Today.
Daily Updates రోజు వారీ, వారానికి సంబంధించిన రాశి ఫలాలు, జ్యోతిష్య సంబంధించిన కథనాల కోసం Astrologytelugu.com వెబ్ సైట్ ను క్లిక్ చేయండి.
తాజా సినిమాల పాటలు, భక్తి పాటలు, జానపద పాటల కోసం www.lyricss.co.in వెబ్ సైట్ ను సందర్శించండి.
ఆర్టికల్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాతో పంచుకోండి. ప్లీజ్ డోంట్ అబ్యూస్ వర్డ్స్. ఈ కథనం మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు దీనిని షేర్ చేయండి. ధన్యవాదాలు.
Post a Comment
గమనిక : పైన చెప్పబడిన రాశిఫలాలు, ఇతర కథనాలన్నీ కూడా జ్యోతిష్య శాస్త్రం, మతవిశ్వాలపై ఆధారపడి ఉంటాయి. ఇవి కేవలం ఊహల ఆధారంగా పేర్కొనబడినవి. దీనికి ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునేందుకు నిష్ణాతులైన జ్యోతిష్య పండితులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరని మనవి. వీటిని www.astrologytelugu.com ధృవీకరించడం లేదు.